అమరుల త్యాగాలు మరువలేనివి రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎస్పి రోహిణి ప్రియదర్శిని

అమరుల త్యాగాలు మరువలేనివి రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎస్పి రోహిణి ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, మెదక్: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో చివరి రోజు  అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జిల్లా ఎస్పీ పి. రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ‘మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో పోలీస్ సిబ్బంది, యువకులు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే  పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఆర్పిస్తూ.. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరుపున ప్రగాఢ సంతాపన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల మంచి భవిష్యత్తు కోసం సంఘ విద్రోహశక్తులతో పోరాడి ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. తలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు. 

ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో  పోలీసులతోపాటు,  ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున రక్త దానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పిలు ఫణీంద్ర, సుభాష్ చంద్రభోస్, మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.బి సి.ఐ సందీప్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, దిలీప్, ఆర్.ఐ.లు నాగేశ్వర్ రావ్, అచ్యుత రావ్, రెడ్ క్రాస్ చైర్మన్ డా౹౹ఏలేటి రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ పి.లక్ష్మన్  యాదవ్, కార్యదర్శి టి.సుభాష్ చంద్ర బోస్,  మెంబెర్స్ దేమే యాదగిరి, వి.దామోదర్ రావు,వి.సతీష్ రావు, ప్రసాద్, వి.శ్రీనివాస్,   ఎస్.ఐలు అమర్, ఆనంద్, పోచయ్య, నరేష్, భవానీ కుమార్, సుభాష్, మహిపాల్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .