తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ శేరి నివాళులు

తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ శేరి నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శంకరంపేట (ఆర్) మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి  డిఎస్పి యాదగిరి రెడ్డి, తహసిల్దార్ మహేందర్ గౌడ్,  అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరులకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాలు సాధిద్దాం అని ఎమ్మెల్సీ శేరి, ఇతర ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్సీ అన్నారు. హైదరాబాదులో ఎక్కడైతే తెలంగాణ ఆస్తిత్వ చిహ్నమైన తెలంగాణ భవనాన్ని కూల్చివేశారో... ఆ స్థలంలోనే తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి అమరులకు రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నివాళులు అర్పిస్తున్నదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. పర్యాటకులు  సందర్శించే విధంగా అత్యాధునికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ప్రతి పేరును, వివరాలను ఈ అమరవీరుల చిహ్నంలో లిఖించడం జరిగిందని తెలిపారు. వెంట స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, కామారం ప్యాక్స్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మండల నాయకులు సుధాకర్, మనోజ్, సిద్ది రాములు, బిక్షపతి, రమేష్ గౌడ్, లక్ష్మా గౌడ్, బాబు, లింగంగౌడ్, ఎర్రి కుమార్, ఉపసర్పంచ్ జీవన్, యువ నాయకులు శ్రీను నాయక్, రమేష్ గౌడ్, సుధాకర్, డీఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ లక్ష్మీ బాబు, ఎస్సైలు సుభాష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.