బచ్చన్నపేట ఎస్సై సస్పెండ్

బచ్చన్నపేట ఎస్సై సస్పెండ్

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు సీపీ రంగనాథ్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పొచ్చన్నపేట గ్రామానికి చెందిన  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, పోలీస్  అధికారిగా చేయాల్సిన పనిని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసు శాఖ గుర్తించింది. నవీన్ గతంలో నమోదైన కేసుల దర్యాప్తు, విధుల్లో ఆలసత్వంతో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సై నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు.