నేడే మండల స్థాయి సీఎం కప్ క్రీడలు

నేడే మండల స్థాయి సీఎం కప్ క్రీడలు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మండల స్థాయి సీఎం కప్ క్రీడలు నేడు ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య తెలిపారు. స్థానిక బాలికల పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించే సీఎం కప్ క్రీడల కన్వీనర్ గా ఎంపీపీ రేఖ గట్టయ్య, సభ్యులుగా జడ్పిటిసి మారపాక రవి, ఎంపీడీవో శ్రీధర్ స్వామి, తాసిల్దార్ పూల్ సింగ్ చాహన్, ఎస్సై శ్రవణ్ కుమార్ పిఈటిలు గిరెడ్డి ప్రమోద్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, రమేష్, మహేష్, రాజు వ్యవహరిస్తారన్నారు.