బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా

బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా జెండగే హనుమంతు కొండిబా శుక్రవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కరరావు, అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీలు వెంకటరెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు కలెక్టర్ కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.