ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల కోసమే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల కోసమే   కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 భూదాన్ పోచంపల్లి, ముద్ర; కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక  కేంద్రంలోని టూరిజం పార్క్ నుండి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు . పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గ్రామ ప్రజలకు, మహిళలకు వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ,సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుకి  ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ర్యాలీలో వివిధ సమస్యల గురించి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

పోచంపల్లిలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేసారని,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబల్ బెడ్ రూములు ఇస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారని, గ్రామంలో ఇందిరమ్మ ఉన్నప్పుడే తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు .ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూధన్ రెడ్డీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్, జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్,సింగిల్ విండో వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, సర్పంచులు బొడిగే శంకరయ్య,చిన్నలచ్చి లింగస్వామీ, మండల ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ యాదవ్,పట్టణ కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి,కౌన్సిలర్లు భోగ భానుమతి విష్ణు, మోటే రజిత రాజు,నాయకులు గునిగంటి రమేష్ గౌడ్, చేరాల సుధీర్, జింకల కుమార్,గ్యారా సందీప్,జింకల సూర్య తదితరులు పాల్గొన్నారు.