రాహుల్ గాంధీపై కేసులు సిగ్గుచేటు  ..టిపిసిసి ప్రధాన కార్యదర్శి

రాహుల్ గాంధీపై కేసులు సిగ్గుచేటు  ..టిపిసిసి ప్రధాన కార్యదర్శి
స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఏఐసిసి అగ్రనేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు సిగ్గుచేటని, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ఆమానుషమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఆమె మాట్లాడారు.
 గొప్ప ప్ర‌జాస్వామిక దేశంగా వ‌ర్ధిల్లుతున్న భార‌త‌దేశంలో బీజేపీ కులాలు, మ‌తాల పేరుతో చిచ్చు పెడుతోంద‌ని అన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు పెంచి సామాన్యుడిపై భారం మోపిందన్నారు. బీజేపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండగ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీపై త‌ప్పుడు కేసుల‌తో క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశంలో మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంద‌ని వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, కోర్కుప్పల మహేందర్, ఝాన్సీ, నాగయ్య, ఎల్లయ్య, పాపయ్య తదితరులు ఉన్నారు.