మార్షల్ ఆర్ట్స్ మన జీవితంలో భాగం కావాలి: జీసీడీవో గౌసియా బేగం

మార్షల్ ఆర్ట్స్ మన జీవితంలో భాగం కావాలి: జీసీడీవో గౌసియా బేగం

ముద్ర ప్రతినిధి, జనగామ : మార్షల్ ఆర్ట్స్ మన జీవితంలో భాగం కావాలని జీసీడీవో గౌసియా బేగం అన్నారు. నెల రోజుల పాటు ప్రభుత్వం రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ శిక్షణ ముగింపు వేడుక జనగామ మండలంలోని చౌడారంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రాణి, కరాటే మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జీసీడీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బాలికలు నెలరోజుల పాటు తీసుకున్న కరాటే శిక్షణ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలన్నారు. ఎస్‌వో రాణి మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ తో మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం యాదాద్రి జిల్లాలో జరిగిన సౌత్ ఇండియా కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి వివిధ విభాగాల్లో బహుమతులు గెలుచుకున్న విద్యార్థినులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ మాస్టర్ సంతోష్ కుమార్‌‌ను  శాలువాతో సన్మానించి అభినంధించారు. కార్యక్రమంలో టీచర్లు రాధిక, హసీనాబీ, శ్రీలత, రజిత, మంజుల, స్రవంతి, అనూష పాల్గొన్నారు.