వ్యక్తి హత్య కేసులో 14 మంది రిమాండ్

వ్యక్తి హత్య కేసులో 14 మంది రిమాండ్

రెండు రోజుల్లో చేదించిన మెదక్ జిల్లా పోలీసులు
పెద్దశంకరం పేట, ముద్ర న్యూస్: మెదక్ జిల్లా పెద్ద శంకంపేట మండల పరిధిలోని బద్దారం హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లో చేధించారు. ఈ సంఘటనలో 14 మందిని రిమాండ్ చేస్తున్నట్లు మెదక్ డీఎస్సీ సైదులు తెలిపారు. శుక్రవారం టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన గాజుల రవీందర్, గడ్డమీది విఠల్ గౌడ్ మధ్య పాత కక్షలున్నాయి. ఈ కారణంతో రవీందర్ ఇంటి నుండి పెద్దశంకరంపేటకు వచ్చి ఆటోలో విఠల్ గౌడ్ తో పాటు భూమయ్య, ప్రభాకర్ వెళ్తుండగా గ్రామ శివారులోని పాడుంబాయి కుంట సమీపంలో ఈ నెల 8న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో వీరిపై గడ్డమీది విఠల్, కిషన్ గౌడ్, సత్యాగౌడ్, ప్రవీణ్ గౌడ్,  లక్ష్మీనారాయణ గౌడ్, కుమ్మరి శ్రీనివాస్,  నీరుడి జయంత్, మంగాల అంజయ్య, బంధ మల్లేశం, మంగళి ఈశ్వరయ్య మారుతి, నర్సింలు, కర్చర్ల రామాగౌడ్, గడ్డమీది అనిల్ గౌడ్ లు కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతో దాడి చేయగా ప్రభాకర్ పారిపోయాడు.

భూమయ్య చనిపోయాడని వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి అల్లాదుర్గం సీఐ జార్జ్ తో పాటు సిబ్బందిని తీసుకొని వెళ్లగా రవీందర్ మరణించి ఉన్నాడు. రవీందర్ ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా 9వ తేదీ ఉదయం శివారులోని ముళ్ల పొదళ్ల చాటున కనిపించగా కుటుంబీకులకు సమాచారం అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. రవీందర్ 8న ఉదయం బద్దారం గ్రామ పంచాయితీ వద్ద మంచినీటి కోసం సర్పంచ్ భర్త అయిన విఠల్ గౌడ్ తో గొడవ పడ్డాడు. దీంతో విఠల్ గౌడ్ ప్రజల మధ్యనే నిన్ను చంపేస్తానంటూ ఒకరికొకరు బెదిరించుకున్నారు. సాయంత్రం ఇలా కావడంతో గ్రామంలో విసాదచాయలు అలుముకున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ వివరించారు.