మానవాళికి చెట్లు ఎంతో అవసరం

మానవాళికి చెట్లు ఎంతో అవసరం
  • మానవాళికి చెట్లు ఎంతో అవసరం
  • జడ్పీ చైర్ పర్సన్ హేమలత

తూప్రాన్, ముద్ర:మానవాళికి చెట్లు ఎంతో అవసరమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత గౌడ్ అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ హరిత దినోత్సవం సందర్భంగా మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి, తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామాలలో గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి క్రీడా మైదానంలో  మొక్కలు నాటి మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ గ్రామ గ్రామాన నర్సరీలు పెట్టి ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతూ తెలంగాణలో 24 శాతం ఉన్న అటవీ శాతాన్ని 30 శాతంకి పెరిగేలా కృషి చేసి వర్షాలు బాగా పడేలా పర్యావరణం అభివృద్దికి ముఖ్యమంత్రి కెసిఆర్  ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వెంకట శైలేష్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఇవో సుభాషిణి, ఎస్ఐ  సురేష్ కుమార్, ఎంపీపీ స్వప్న వెంకటేష్, ఎంపీడీవోలు యాదగిరి రెడ్డి , అరుంధతి,  వైస్ ఎంపీపీ వీఠల్ రెడ్డి, నాయకులు బిక్షపతి, స్వామి, రవి, మహేందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, అటవి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.