జ‌న‌గామ‌లో ఉద్రిక్తత..!

  • బీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ, సీపీఎం నాయకుల దాడి
  • పోలీస్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి..

ముద్ర ప్రతినిధి,జనగామ: జనగామ ప‌ట్ట‌ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లోని 244 కేంద్ర వ‌ద్ద ఉద్రిక్త‌త‌ చోటుచేసుకుంది. గురువారం పోలింగ్ షురూ అయ్యాక..
పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించేందుకు కేంద్రంలోకి బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్ళాడు. అదే సమయంలో ఆయన వెంట మరికొంత మంది  ఆ పార్టీ కార్యకర్తలు ఆయనను అనుసరించి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి బూత్ బయట వేచి ఉన్నారు. పల్లా ఈవీఎం లను పరిశీలిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి మరికొందరు పోలింగ్ బూత్ వద్దకు ఎందుకు వచ్చారని? ప్రశ్నించగా బిఆర్ఎస్ కార్యకర్త కృష్ణ వస్తే మీకేం  ఇబ్బంది, అనడంతో అక్కడే ఉన్న సీపీఎం నాయకుడు బూడిద గోపి, బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి సహా మరికొందరు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు.
బీఆర్ఎస్ కార్యకర్త పై దాడికి దిగారు.  దీంతో ఇరువు వర్గాల మధ్యన ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే జనగామ సిఐ శ్రీనివాస్ యాదవ్, టాస్క్ ఫోర్స్ సీఐ బాబూలాల్ తదితర సిబ్బంది అక్కడున్న వారిని చెదరగొట్టారు. బిఆర్ఎస్ కార్యకర్త కృష్ణను సీఐ పోలీస్ స్టేషన్ కు తరలించగా అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి విడిపించుకుని వెళ్ళిపోయాడు. ఘటన స్థలానికి డిసిపి సీతారాం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా జనగామ వ్యవసాయ మార్కెట్ సమీపంలోని మరో బూతులు కూడా అధికార,  ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు గోడబుద్ధి గారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సభ్యులు మరిగించారు.