కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

జనగామ టౌన్, ముద్ర : మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేసీఆర్ కు జనగామ మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తెల్లవారు జామున తెలంగాణ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జనగామ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పానుగంటి ప్రవీణ్, అధ్యక్షుడు మునిగే కరుణాకర్, నాయకులు తిప్పారపు కళ్యాణ్, మిద్దెపాక రాజు, కొయ్యడా వెంకటస్వామి, గంధమల్ల మల్లేష్, వతాల యాదగిరి, గుర్రం లక్ష్మి, కోలేపాక ఎల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.