ముత్తిరెడ్డి నీళ్ల దాహం వల్లే యువ రైతు బలి: మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ముత్తిరెడ్డి నీళ్ల దాహం వల్లే యువ రైతు బలి: మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నీళ్ల దాహం వల్లే యువ రైతులు బలవుతున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ టీపీసీసీ మెంబర్‌‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. కరెంట్‌ షాక్‌తో చనిపోయిన అడవి కేశవాపూర్‌‌కు చెందిన గూడ రాజు కుటుంబాన్ని మంగళవారం కొమ్మూరి ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక లీడర్లతో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని పంపించారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలని గతంలో తాను రిజర్వాయర్లను ఏర్పాటు చేయించానని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రైతుల బాగు కోసం కాకుండా కేవలం తన భూమికి మాత్రమే నీరు అందే విధంగా కాల్వలకు గండి కొట్టి రిజర్వాయర్ లో ఉన్న నీటిని అక్రమంగా తన వ్యవసాయ భూమికి నీళ్లు మళ్లించుకున్నాడని ఆరోపించారు.

యువ రైతు చావుకి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బాధ్యత వహించి వెంటనే ప్రభుత్వం ద్వారా మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియ అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జయరాం, కాంగ్రెస్ నాయకులు భన్సీ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, నియోజకవర్గ అధ్యక్షుడు యాట క్రాంతి, నిఖిల్ గౌడ్, శివయ్య గౌడ్, యాదయ్య, చక్రి పాల్గొన్నారు.