మంచోడు అంటేనే ఓటేయండి

మంచోడు అంటేనే ఓటేయండి

 కాంగ్రెస్, బిజెపిలను నిలదీయండి: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: భూ కబ్జాలు చేయడు, రౌడీయిజం తెలియదు, భూదందాలు రావు, ఎక్కడపడితే అక్కడ తాగడు తినడు, అవినీతి అక్రమాలు తెలియవు మంచోడు అంటేనే ఓటు వేయండి అని టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చంద్రు తండా, కోమటి గూడెం, రంగరాయ గూడెం, సముద్రాల, ఇప్పగూడెం గ్రామాలలో గురువారం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం గ్రామ శాఖ అధ్యక్షులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చేయలేని వాడు , చేతకానివాడు, పని లేని వాడు , పనికిమాలిన వాడు చాలా మాటలు మాట్లాడుతారు. కుట్లే రాయి తీయలేనోడు, ఎట్ల రాయి తీసినట్టు మాట్లాడుతారు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి ? పదేళ్ల తెలంగాణలో కెసిఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి ఎలా ఉంది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రాష్ట్రంలో ఇటీవల హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ఇటీవల  గెలిచిన కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ఓట్లు అడిగేందుకు వచ్చిన ఆ పార్టీ నేతలను ప్రశ్నించాలన్నారు. బిజెపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ఓట్లు ఎలా అడుగుతారు శ్రీహరి ప్రశ్నించారు. ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గత పదేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ  అభివృద్ధి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.

 నాకు వ్యాపారం, వ్యవసాయం, వేరే వ్యాపకాలు లేవు నాకు వ్యక్తిగత ఎజెండా లేదు, నా ఎజెండా మొత్తం నియోజకవర్గన్ని అభివృద్ధి చేయడమే అందుకే ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సర్పంచులు అశోక్, పరుశురాములు, ఉప సర్పంచ్లు ఆంజనేయులు, ఇమ్మడి ప్రసాద్ నాయకులు బి వెంకన్న, సారంగపాణి, బి శంకర్, చందర్ రెడ్డి, యాదగిరి, సురేష్, నరేందర్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్లు కుమారస్వామి, రమేష్, రాజు, శైలజ అజయ్ రెడ్డి, తోట వెంకన్న, పల్లె రవి, మంద రాజు, రామ్ నరసయ్య, దైవ ఎలిసన్, జయశ్రీ,, చట్ల యాకయ్య, నరసింహ రాములు, పిల్లి శీను, పల్లె యాదగిరి, మూలుకుంట్ల రాజశేఖర్, ఎల్ల గౌడ్, పొగాకు సోమయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.