గృహలక్ష్మి ఆడపడుచులకు వరం...

గృహలక్ష్మి ఆడపడుచులకు వరం...

 ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 
ముద్ర ప్రతినిధి భువనగిరి : గృహ లక్ష్మీ పథకం తెలంగాణ ఆడపడుచులకు ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఏకే ఫంక్షన్ హాల్ లో మండలంలోని పలు గ్రామాల, పట్టణంలోని వార్డుల గృహలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. 2014 ముందు  నేడు తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడ కరెంటు ఉండదని అంధకారంలో జీవించాల్సి వస్తుందని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వారి అంచనాలకు మించి 24 గంటల కరెంటు ఇస్తున్నారని అన్నారు. 

సాగు తాగు నీటి కోసం మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి  చెరువులు కుంటలు   నీటితో కళకళలాడేలా చేశారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కెసిఆర్ కిట్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో  పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చేసిన ఘనత కెసిఆర్ దే అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ రాసాల నిర్మల, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి,  కౌన్సిలర్లు దిడ్డి కడి భగత్, ఎండి అజీమ్, జిట్టా వేణుగోపాల్ రెడ్డి, ఊదరి లక్ష్మి సతీష్, వెంకట్ నాయక్ పాల్గొన్నారు.