ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

భువనగిరి జూలై 24 (ముద్ర న్యూస్):  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పట్టణ పార్టీ, మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.  బాగాయత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి గాను చెరువు కట్ట సుందరీకరణకు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రోడ్డు వెడల్పుకు, అన్ని వార్డుల డెవలప్మెంట్ కు అడగగానే కోట్ల రూపాయలను ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్  నాయకత్వంలో మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ , జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్ , మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు , మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య , ఎంపీపీ నిర్మల వెంకట స్వామి, జడ్పిటిసి బీర్ మల్లయ్య , మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా అజీముద్దీన్, జిట్ట వేణుగోపాల్ రెడ్డి , వెంకట్ నాయక్ , దొడ్డికాడి భగత్, నాయకులు ఇట్టబోయిన గోపాల్ , అతికం లక్ష్మీనారాయణ గౌడ్, సురపల్లి రమేష్, కుశంగల రాజు, గంటపాక జంగయ్య , తుమ్మల పాండు, నాయిని పూర్ణ , మహిళా నాయకులు సిద్దుల పద్మ , రత్నపురం పద్మ , నాయకులు వెల్దుర్తి రఘునందన్, తాడూరు బిక్షపతి, కాలేరు లక్ష్మణ్, ఇస్మాయిల్, సుభాష్, నాగు, సూరజ్, ఇండ్ల శ్రీను పాల్గొన్నారు.