ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను పట్టించిన సీసీ కెమెరా

ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను పట్టించిన సీసీ కెమెరా

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఉదయం మక్కజొన్నల కుప్ప వద్ద నిద్రిస్తున్న మహిళా రైతు శాంతి కాలుపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ప్రమాదానికి గురైన ఘటనలో ట్రాక్టర్ ను పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఓ రైతు ట్రాక్టర్లో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తెచ్చి పోయడానికి యత్నిస్తున్న క్రమంలో మహిళా రైతు కాలిపైకి ట్రాక్టర్ ట్రైలర్ టైరు వెళ్ళింది. దీనితో ఆమె కేకలు వేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ఆ ట్రాక్టర్ తో పారిపోయాడు.

ఈ ఘటనపై కేసముద్రం ఎస్సై తిరుపతి విచారణ చేపట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజి క్షుణ్ణంగా పరిశీలించారు. ఉప్పరపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సిసి ఫుటేజ్ లో వేగంగా వ్యవసాయ ఉత్పత్తులతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ను గుర్తించారు. సిసి పుటేజి ఆధారంగా విచారణ జరుపగా ట్రాక్టర్ డ్రైవర్ కేసముద్రం మండలం మర్రి తండాకు చెందిన వాంకుడోత్ రాంజీ గా గుర్తించి అరెస్టు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, అలాగే నేరం జరిగితే నేర విచారణలో దోహదపడుతుందన్నారు.