ఖానాపూర్ లో నకిలీ నోట్ల కలకలo

ఖానాపూర్ లో నకిలీ నోట్ల కలకలo
  • వృద్దురాలిని మోసం చేసిన ఆగంతకుడు
  • రెండు వందల రూపాయల నోటు కూరగాయలు కొన్న వైనం

ఖానాపూర్, ముద్ర  : ఓ ఆగంతకుడు వృద్దురాలిని మోసం చేసి నకిలీ నోటు ఇచ్చిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండల కేంద్రం లోని కూరగాయల మార్కెట్లో చిన్న వ్యాపారం చేసుకుంటున్న కీర్తి పోశవ్వ అనే వృద్దురాలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నకిలీ రెండు వందల రూపాయల నోటు ఇచ్చిమోసం చేసాడు. ప్రతి రోజు పాత బస్టాండ్ సమీపంలో చిన్నగా కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. బుధవారం అంగడి బజారు కావటంతో ఎక్కువ గా జనాలు మార్కెట్ వచ్చి వస్తువులు కొనుగోలు చేసుకొంటారు. ఈ క్రమంలో కూరగాయల విక్రయిస్తున్న వృద్దురాలి వద్దకు సాయంత్రం సమయంలో వచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చి రూ. 50 కూరగాయలు కొన్నాడు. మిగిత రూ. 150 తీసుకోనిపోయాడు.

ఈ విషయం తెలియని పోశవ్వ మరొక వ్యక్తికి ఈ నోటు ఇవ్వగా ఇది నకిలీ నోటు అని గ్రహించి చెప్పారు. దీనితో ఆ వృద్ధురాలు లబోదిడో మంటూ విలపించిది. తాను రోజంతా అమ్మితే వంద రూపాయల లోపు మాత్రమే మిగులుతాయని వాపోయింది. అయితే ఈ రెండు వందల నోటును కలర్ జిరాక్స్ తీసి అచ్చo నోటు లాగే తయారు చేసాడు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకులను, వృద్ధులను టార్గెట్ చేసుకుని ఈ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటుకు సెంటర్ లో మెరుపును గంతో అతికించి తయారు చేస్తున్నారు. పోలీస్ లు ఇలాంటి సంఘటనపైన దృష్టి సారించి ఆగంతకులను పట్టుకోవాలని కోరుతున్నారు.