జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. బైకు - కారు ఢీ: ఇద్దరు స్పాట్ డెడ్

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. బైకు -  కారు ఢీ: ఇద్దరు స్పాట్ డెడ్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కమలాపురం వద్ద 161 జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలీలా ఉన్నాయి...  నిజాంపేటకు చెందిన బాయికాడి ఆగమయ్య (58), చటుకుల తుకారం(38) ఇద్దరు కలిసి పెద్ద శంకరంపేటకు బైక్ పై వస్తుండగా... శంకరంపేట నుండి నిజాంపేట రహదారిపైకి వెళ్తున్న కారును రాంగ్  ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్ లో మరణించారు. కారులో ఉన్న వ్యక్తులు భయంతో  అక్కడి నుండి పరారయ్యారు. 1033 అంబులెన్స్ వారు పోలీసులకు సమాచారం అందజేశారు.  పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.  మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు.