104 కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె

104 కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె


ముద్ర ప్రతినిధి, మెదక్:104 కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మెదక్ కలెక్టరేట్ ముందు సమ్మెకు చేపట్టారు.గత 15 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా, చాలి చాలని వేతనాలతో సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.  రెగ్యులర్ కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కాబట్టి వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి నెల నెలా జీతాలు, ఉద్యోగ భద్రతా కల్పించాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ లను కంప్యూటర్ ఆపరేటర్ మార్చాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వారాజ్,104 అధ్యక్షుడు పౌలయ్య, భూపతి, అవినాష్ గౌడ్, రాజు, ఇక్బాల్, నూరోద్దీన్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.