నేటి నుండి నామినేషన్లు ఏర్పాట్లు పూర్తి

నేటి నుండి నామినేషన్లు ఏర్పాట్లు పూర్తి
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

ఎన్నికల పక్రీయా సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాధారణ ఎన్నికలు- 2023లో భాగంగా  కలెక్టర్ కార్యాలయంలో   గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 215043 ఉన్నారు. అందులో మహిళలు 1,12,218, పురుషులు 1,0 28,20,  థర్డ్ జెండర్ 5 గా ఉన్నారు. మెదక్ లో  పి.డబ్ల్యూ.డి .3839, 80పైబడిన వయస్సున్నవారు 2446 ఉన్నారు. యువ ఓటర్లు 8098 ఉన్నారు.నర్సాపూర్ నియోజక వర్గంలో మొత్తం 2,21,972 ఉన్నారు. అందులో మహిళలు 1,13,551, పురుషులు 1,084,14, థర్డ్ జెండర్ 7,  పిడబ్ల్యూడి 4531, 80పైబడిన వారు 1716, యువ ఓటర్లు 8104 ఉన్నారు. స్వీప్ ద్వారా రెండు నియోజక వర్గాల్లో కళజాత బృందాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.

ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ....

ఎంసీసీ 30 పిర్యాదులు వచ్చాయని, సి- విజిల్ ద్వారా 22 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 9 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 27,690  లీటర్ల మద్యం సీజ్ చేశామని, ఎఫ్ఎస్టీ టీమ్ ద్వారా 12,01,920 డబ్బు సీజ్ చేశామని , పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా 1,31,63,647 ద్వారా డబ్బు సీజ్ చేశామని వివరించారు. మెదక్  జిల్లాలో మొత్తం  1,41,09,480, విలువగల డబ్బు  సీజ్ చేశామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్, నర్సాపూర్ రిటర్నింగ్ అధికారులు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.