నా కష్టం - పరాయిల పాలు చేసిండ్రు

నా కష్టం - పరాయిల పాలు చేసిండ్రు
  • ఆ రెండు పార్టీలను పటిష్టం చేశా
  • బిజెపికి మాదాసు రాజీనామా 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్, బిజెపి పార్టీల పటిష్టత కోసం నేను కృషి చేస్తే అధిష్టానాలు నా కష్టాన్ని పరాయిల పాలు చేసిండ్రు అందుకే బిజెపికి రాజీనామా చేస్తున్నానని  ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికుడినైనా నేను ప్రజా సేవ చేసేందుకు 2018 లో రాజకీయ అరంగేట్రం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో కనుమరుగవుతున్న తరుణంలో నా సొంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానన్నారు. అయితే ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకొని ఇందిర టికెట్ తెచ్చుకోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బిజెపిలో చేరి గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేశానన్నారు.

నియోజకవర్గంలో 3 వేల మంది కి ఆర్థిక సాయం చేశానని, బండి సంజయ్ నాయకత్వంలో నియోజవర్గంలో పార్టీనీ బలోపేతం చేసిన టికెట్ ఇచ్చేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదు పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని విజయ రామారావుకు టిక్కెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో ఆ రెండు పార్టీల జెండా గద్దెలు కట్టించి, జెండావిష్కరణలు చేసే కార్యకర్తలను ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశానన్నారు. ఇంత చేసినా తనకు గుర్తింపు అని నాడు కాంగ్రెస్ కు, నేడు బిజెపికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. నేటి నుండి బిజెపికి నాకు సంబంధం లేదు భవిష్యత్ కార్యాచరణ త్వరలో పర్కటిస్తా అన్నారు. ఈ సమావేశంలో ఏదునురి నాగరాజు, లింగాల ఆదిత్య, కనకం ప్రవీణ్, మాడిషెట్టీ మహేందర్, బజ్జురి రవీందర్, కనకం సంపత్, రడపాక శ్రీనివాస్ , రడపాక రాజ్ కుమార్, అమంచ రవీందర్, చెరిపల్లీ త్రిషుల్, చింతల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.