రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

 స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి పడి రాజేంద్ర కజోడికా అనే వ్యక్తి గాయపడిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్, సాలిపుర మరాఠా గ్రామానికి చెందిన రాజేంద్ర కజోడికా అనే వ్యక్తి కాజీపేట నుండి సికింద్రాబాద్ వైపు వెళుతున్న రైల్ లో ప్రయాణిస్తూ నష్కల్ స్టేషన్ సమీపంలో జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో కాళ్ళకు, చేతులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ 108 సిబ్బంది హరికృష్ణ, శ్రీనివాస్ ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నది.