విద్యారంగ సమస్యలపై టీఎస్ యూటీఎఫ్ పోరాటం

విద్యారంగ సమస్యలపై టీఎస్ యూటీఎఫ్ పోరాటం

ముద్ర ప్రతినిధి, జనగామ :  విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయంగా టీఎస్ యూటీఎఫ్ చేస్తుందని ఆ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు చెప్పారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయం ముందు సంఘ సీనియర్ నాయకుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.

అనంతరం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యా విధానంలో మార్పుల కోసం అనేక మార్లు విన్నవించినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు. నాణ్యమైన విద్య, ఉచిత విద్య కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస రావు, జిల్లా కార్యదర్శి మడూరి వెంకటేశ్ ,జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, శ్రీనివాస్, కనకయ్య, కృష్ణ , మహేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.