జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ నెలవారి సమీక్ష సమావేశం

జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ నెలవారి సమీక్ష సమావేశం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హాల్ నందు  జిల్లా ఎస్పీ కే. సృజన. పోలీస్ అధికారులతో  నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ. మాట్లాడుతూ. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది  నిరంతరం కృషి చేయాలని, ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలి, కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, పెండింగ్ కేసులపై  సమీక్ష సమావేశంలో ఎస్పీ. తెలిపారు.ఈ సమీక్షలో బాగంగా పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్  గ్రేవ్ కేసుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. 

గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలని, పెండింగ్ లో ఉన్న దొంగతనం కేసులలో పురోగతి సాధించాలని అదేశించారు. కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలనీ, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. నాన్ బేయిలబుల్ వారెంట్ లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని అదేశించారు. రోడ్డు ప్రమాదాలు  సైబర్ నేరాల నియంత్రణ గురించి పోలీస్ కళా బృందం ద్వారా గ్రామాలలో ప్రజలకు విరివిగా  అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

జిల్లా కేంద్రంలో రోడ్డు సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్స్ కు, సైన్ బోర్డ్ కు ఆర్&బి అధికారులతో మాట్లాడి  పెయింటింగ్ వేయించాలని, అవసరమైనా చోట కొత్తగా ఏర్పాటు చేయడం వంటివి చేయాలని ట్రాఫిక్ ఎస్సై కు సూచించారు. 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకుంటున్న  చర్యలలో బాగంగా  హై వే అథారిటీ వారితో మాట్లాడి అక్కడక్కడ ఏర్పాటు చేయాల్సిన స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్, బారికెడ్స్, రంబుల్స్ , రోడ్డు కు సంభందించిన చిన్న చిన్న మార్పులను, ఇతర పనులను వెంటనే చేయించాలని అలంపూర్ సి ఐ ని అదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్ సిబ్బంది తో నిరంతరాయంగా ప్రోయాక్టివ్ గా గస్తీ నిర్వహించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అదించడానికి అదికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉండాలనీ సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు దారుని పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, ప్రతి పిర్యాదు పై పారదర్శకంగా విచారణ చేపట్టి వెంటనే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో   కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్, డీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్, అలంపూర్ సి. ఐ సూర్య నాయక్,   ఆర్ ఐ నాగేష్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల  ఎస్సైలు, డీసీఆర్బీ, సిబ్బంది, ఐటీ సెల్, సిబ్బంది పాల్గొన్నారు.