ఉన్నతమైనది జర్నలిస్టుల వృత్తి: జిల్లా కలెక్టర్

ఉన్నతమైనది జర్నలిస్టుల వృత్తి: జిల్లా కలెక్టర్
Higher Career of Journalists District Collector

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల్: సోమవారం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన  ప్రత్యేక కంటి  వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సమాజంలో ఉన్నతమైన వృత్తి జర్నలిస్ట్ ల దని జిల్లా కలెక్టర్ అన్నారు. పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు అందరు కంటి వెలుగు ప్రత్యేక క్యాంప్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక క్యాంపుల ద్వారా పాత్రికేయులకు, వివిధ వర్గాల వారందరికీ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో బఫర్ టీం ద్వారా జర్నలిస్టులకు ఈ సౌకర్యం కల్పించామని అన్నారు.

సమాజంలో ఉన్నత మైన వృత్తి జర్నలిజం అని వృత్తిలో భాగంగా పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు ఉండి  వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పత్రికలు, టివిలు, సామాజిక మాధ్యమాల ద్వారా  ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వారు కృషి ఎంతో ఉపయోగకరంగా ఉందని  అన్నారు. జిల్లాలో (25) టీం ల ద్వారా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ఇంకా వైద్య పరీక్షలు చేసుకొని వారు వెంటనే సంబంధిత క్యాంపులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు.

ఈ వైద్య పరీక్షల్లో  జర్నలిస్టులు,  వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని తెలిపారు. జర్నలిస్టు కుటుంబాలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా కంటి అద్దాలు పొందాలని తెలిపారు. కంటి చూపును బట్టి వారికి అవసరమైన చికిత్స అనంతరం కంటి అద్దాలు  అందజేస్తారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ చెన్నమ్మ ముందుగా కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం 146 మందికి పరీక్షలు నిర్వహించగా 83 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.