సిఎం ఇలాకాలో.. డిష్యుమ్... డిష్యుమ్

సిఎం ఇలాకాలో.. డిష్యుమ్... డిష్యుమ్

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో డిష్యుమ్... డిష్యుమ్ బయటపడ్డ విభేదాలు
తూప్రాన్, ముద్ర: ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు అంతర్గతంగా ఉన్న విబేధాలు శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బయట పడ్డాయి.  మండల కేంద్రం మనోహరాబాద్ లో నిర్వహించిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మండల పార్టీ అధ్యక్షులు పురం మహేష్, మాజీ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వంగ రమేష్ గౌడ్ ల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. ఉద్యమ సమయం నుండి పార్టీకి సేవ చేస్తుంటే తమకు కనీసం గుర్తింపు ఇవ్వరా అని రమేష్ తో పాటు మంగ్యా నాయక్, నాగిరెడ్డి తదితరులు సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో బాహబాహికి దిగారు. వెంటనే అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి కల్పించుకుని గొడవను సద్దుమణిగించారు.

నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయట పడడం తో పార్టీ పెద్దలు అవాక్కయ్యారు. అనంతరం సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ ఇంచార్జ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.  బిఆర్ఎస్ అధ్యక్షులు పురం మహేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మాజీ హౌసింగ్ బోర్డు అధ్యక్షులు భూమ్ రెడ్డి లతో కలిసి అయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందంటే అది ఒక కెసిఆర్ వల్లేనని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు జీవన అభివృద్ధి సాధించారని అన్నారు. ఒకప్పుడు కరువులో ఉన్న నేల కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం అయిందని అన్నారు. కెసిఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశం లో ఎంపీపీ పురం నవనీతరవి, పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేష్, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.