వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :

గద్వాల: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల ఆప్రమత్తంగా ఉండాలని గద్వాల పట్టణ ఎస్సై రామస్వామి. తెలిపారు. గురువారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ. ఎండ వేడి నుంచి సేద తీరడానికి సరదా కోసం తోటి స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువులు, కుంటలు, బావులు వద్దకు ఈతకు వెళ్లకుండా చూసుకోవాలి అని, ఈత సరదా కోసం వెళ్ళిన పిల్లలకు నీటిలో లోతు తెలియక ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందని, రెండు రోజుల క్రితం పట్టణ కేంద్రంలోని లింగం బావి లో తెలుగు పేటకు చెందిన బాలుడు బావిలో మునిగి మృతి చెందిన విషయం అందరికీ విధితమే.గతంలో ఈతకు వెళ్లిన విద్యార్థులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా సందర్భాలు ఉన్నాయని పూర్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున పిల్లలు ఇంటి నుంచి బయటకు పంపించవద్దని కోరారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు చేతికిచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని, మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానిపై కేసులు నమోదు చేసి చటపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు పిల్లలకు మెదశక్తిని ఉపయోగపడేలా సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లల కాలక్షేపం అయ్యేలా చూడాలని ఎస్ఐ రామస్వామి తెలియజేశారు.