పేద ప్రజల సొంతింటి కల నిజం చేసిన ఘనత కేసీఆర్ దే

పేద ప్రజల సొంతింటి కల నిజం చేసిన ఘనత కేసీఆర్ దే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : అర్హులైన లబ్ధిదారులకు ద్వారా డీప్ పద్ధతి ద్వారా ఎంపిక ప్రారంభం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రానివారికి త్వరలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు త్వరలో ఖాళీ స్థలాలు ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్ళు కట్టుకోవడానికి రూ 3 లక్షలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా లక్కీ డీప్ ద్వారా దివ్యాంగులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం నందు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు గద్వాల పట్టణం లో 1275 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.  మొదటి విడతగా 715 ఇల్లు లో అర్హులైన లబ్ధిదారులకు లక్కీ డిప్ పద్ధతి ద్వారా ఎంపిక ప్రారంభించారు. 5 శాతం రిజర్వేషన్ ద్వారా  దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, హాజరయ్యారు.  అర్హులైన 66 మంది దివ్యాంగుల సంబంధించిన  పేరులను ఎంపిక చేసి వారికి 39 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే కి చేతుల మీదుగా డీప్ నుండి కాయిన్ తీయడం జరిగింది.

జిల్లా కలెక్టర్. మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది  అర్హులైన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించడం జరుగుతుంది అన్ని వార్డులో డిప్ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ...
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్. నేతృత్వంలో పేద ప్రజల సొంత ఇంటికి కల సాధ్యమవుతుందని తెలిపారు. గతంలో పాలకులు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో ప్రజల పేరుతో నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులకు మాత్రమే లబ్ధి పొందడం జరిగింది. సామాన్యులకు గత పాలకులు మోసం చేసి అన్యాయము చేయడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్. నిజమైన పేద ప్రజలకు అర్హులైన  లబ్ధిదారులకు ఎంపిక చేసే విధంగా వార్డులలో  సర్వేలు చేసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. త్వరలో మిలిగిన  డబుల్ బెడ్ రూమ్ 560 ఇండ్లు కూడా పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఎంపిక కాని వారికి  ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతామని హామీ ఇచ్చారు. త్వరలో సీఎం కేసీఆర్. నేతృత్వంలో గృహలక్ష్మి పథకం ద్వారా ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా అధైర్య పడకండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్ మురళి, శ్రీను కృష్ణ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, కోటేష్, షుకర్,  జనార్దన్ రెడ్డి,  రిజ్వాన్, భగీరథ వంశీ, కురుమన్న, పరుశురాముడు, ఆర్డిఓ ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ , అధికారులు, లబ్ధిదారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.