బిఆర్ఎస్ జెండాను ఎగురవేసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య 

బిఆర్ఎస్ జెండాను ఎగురవేసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య 

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :  తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం నిధుల కోసం   బిక్ష మెత్తాల్సి వస్తుందని  ఎవని కింద తెలంగాణ ప్రజలు బానిసలుగా బ్రతకొద్దని తలంచి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ పేరుమీద తెలంగాణ రాష్ట్ర సమితి అని 2001 ఏప్రిల్  27న  మన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆవిర్భవింపజేసిన కార్యసాధకుడు అలుపెరుగని పోరాటయోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆనాటి నుండి తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి నేర్పి సకల జనుల సమ్మెకు సై అని సైరను మోగించి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కృషివల్యుడు మన ప్రియతమా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయనే మన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం.

ఈ దినం తెలంగాణ ప్రజలకు శుభదినం. ఈ దినం తెలంగాణ ప్రజలకు బానిస సంకెళ్లు తెగిపడ్డదినం. అంటే టిఆర్ఎస్ ఆవిర్భించిన రోజే తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన దినం   అని. జడ్పీ ఛైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శేషంపల్లి నర్సింహులు, సద్దలోనుపల్లి సర్పంచ్ గ్రామ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, జైపాల్ రెడ్డి. కురువ శేఖర్. కురువ కృష్ణ. గణేష్, కే.మద్దిలేటి, ఎమ్మార్పీఎస్ నాయకులు బిఆర్ ఇమ్మానుయేల్, తదితరులు పాల్గొన్నారు