అధికారం కోసం పాకులాడే కుక్కలు, గుంటనక్కలు వారు

అధికారం కోసం పాకులాడే కుక్కలు, గుంటనక్కలు వారు
  • కేసీఆర్ కాలిగోటికి సరిపడే ఒక్కడు ప్రతిపక్షంలో లేడు
  • బ్రేను లేని బంటి.. పార్టీలు మారే చంటిలు ఎగిరేగిరి పడుతున్నరు
  • సిరిసిల్ల బీఆర్ఎస్ ప్లీనరిలో మంత్రి కేటీఆర్ 

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: బీఆర్ఎస్ సర్కార్ పై మొరిగే వారు కుక్కలు కారని, కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ అధికారం కోసం పాకులాడే గుంటనక్కలు రెండు జాతీయపార్టీలో ఉన్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్ బైపాస్ రోడ్డులో సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల ఫ్లీనరి కార్యక్రమాన్ని నిర్వహించారు.   సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ కి హాజరైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నేటికీ టి అర్ ఎస్ పార్టీకి 22 ఏళ్లు నిండి 23 ఏట అడుగు పెట్టబోతున్నమని,జల దృశ్యం లో పార్టీ పురుడు పోసుకున్నాదన్నారు.2001 లో కెసిఆర్ పార్టీ పెట్టే క్రమం లో  కేసీఅర్ సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నారని తెలిపారు.అనాడు గులాబీ జెండా ఎగురేసే క్రమం లో కెసిఆర్ సాధారణ వ్యక్తి...తెలంగాణ అనే పదాన్ని కేసీఅర్ ఎత్తుకున్నారని పేర్కొన్నారు.30 ఏళ్ల తరువాత మళ్ళీ కేసీఅర్ నాయకత్వం లో ఉద్యమం మొదలు పెట్టి తెలంగాణా సాధించారని కేటీఆర్ వివరించారు.మొట్ట మొదటి సింహ గర్జన లో తప్పు చేసిన, ఎత్తిన జెండా దించిన తెలంగాణ తేకున్న రాళ్ళ తో కొట్టి చంపండి అని సీఎం కేసీఅర్ అనాడు చెప్పారని గుర్తు చేశారని, ధైర్యంగా ప్రకటించరన్నారు.

సీఎం నాయకత్వం లో పని చేయడం పుర్వజన సుకృతం తెలిపారు.సీఎం కేసీఅర్ పై ఎంతో గొప్పగా చెప్పారని రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అనాడు చెప్పారని గుర్తు చేశారని కేటీఆర్ తెలిపారు.ఒకప్పటి సిరిసిల్ల ఎట్లా ఉండే ఇప్పటి సిరిసిల్ల..నేడు ఎట్లా అయిందని కేటీఆర్ అన్నారు.  సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నన్నారు. ప్రతిపక్ష నాయకులు ఆసూయ పడేలా అభివృద్ది కార్యక్రమాలు చేసి సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటున్నన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న మంచి పనులు. అభివృద్ది పనులు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.2009 లో నేను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత రూ. 50 లక్షల రోడ్ కోసం మంత్రుల చుట్టూ చాల తిరిగిన..లాభం లేదన్నారు. తెలంగాణ వచ్చాక పనులు చేసుకోవాలని ఆనాడు తనను అవమానించరన్నారు. నేడు సిరిసిల్ల అభివృద్దికి రూ.కోట్లు ఖర్చు చేశామన్నారు.రూ. 400 కోట్ల రూపాయల తో దేశం లో ఎక్కడ లేని విధంగా నేతన్న లకి వర్క్ ఓనర్ పథకం ఏర్పాటు చేసామంటూ కేటీఆర్ పేర్కొన్నారు.తీర్పుర్ తో పోటీ పడే విధంగా సిరిసిల్ల తయారు అయిందని,అనాడు ఒక్కటె డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విల విల లాడము ..నేడు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల తెచ్చుకున్నామన్నారు.9 ఏళ్ల లో సిరిసిల్ల ను ఎంతో అభివృద్ధి చేశామో ప్రజలే సాక్షి అన్నారు. ఒకప్పుడు ఆదర్శ గ్రామాలు అంటే అంకపూర్, గంగదేవి పల్లి ఉండేది..కానీ మొన్న జాతీయ అవార్డులో తెలంగాణ రాష్ట్రానికి 30 శాతం అవార్డులు గెలుచుకున్నమన్నారు. ఇది తెలంగాణ గొప్పదనమన్నారు.

సిరిసిల్ల జిల్లా లో ఎన్నో ఆదర్శ గ్రామాలు తయారు అయ్యాయని.,తెలంగాణ లో 13 గ్రామాల కి జాతీయ అవార్డులు వచ్చాయని,పట్టణ ప్రగతి లో సిరిసిల్ల కి జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.రాష్ట్రం, కేంద్రం బాగు పడాలి అంటే ఎవరి పని వారు చేయాలని,బి అర్ ఎస్ మారింది పేరు మాత్రమే... డి ఎన్ ఏ మారలేదన్నారు.2010 నుండి 2014 వరకు గుజరాత్ లో జరగని అభివృద్ధి  జరిగింది అని చెప్పి మసిపూసి యామ చేసి నరేంద్ర మోడీ పి ఎం అయ్యారని కేటీఆర్ విమర్శించారు.మహారాష్ట్ర లో రైతులు కేసీఅర్ వెంట ఉన్నారన్నారు. ఎక్కడ సభలు పెట్టిన లక్షల మంది హజరౌతున్నరన్నారు.2014 లో అధికారం లో వచ్చిన నరేంద్ర మోడీ రైతులను పట్టించు కోలేదని,చారిత్రిక అనివార్యత కోసమే కెసిఆర్ జాతీయ నాయకత్వం లో వెళ్ళాడని కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్, బీజేపి నీ తప్పకుండా ప్రజలు బండ కేసి కొడతారని తెలిపారు. 3146 తండాలను గ్రామ పంచాయితీ లను చేశామని పేర్కొన్నారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కెసిఆర్ సంతోషం గా ఉన్నారని తెలిపారు.రాష్ట్ర సచివాలయం కి అంబేడ్కర్ పేరు పెట్టడం వలన అందరూ సంతోషంగా ఉన్నారన్నారు.

ఇది ఎన్నికల ఏడాది..చిన్న పాము అయిన పెద్ద కట్టే తో కొట్టాలని ఎక్కడ నిర్లక్ష్యం చేయ్యోద్దన్నారు.నాకు  సిరిసిల్ల ప్రజల దయతో 89 వేళ ఓట్ల మెజార్టీ తో గెలిపించారుని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒడి పోయామని, మంచి మనిషి వినోద్ కుమార్ను దూరం చేసుకోని మతం పేరు మీద, కులం పేరు మీద గొడవలు సృష్టించే.. విచిత్ర ఎంపి గా తెచ్చుకున్నామన్నారు.అదమర్చి ఉండకూడదు..అలెర్ట్ గా ఉండాలని రానున్న ఎన్నికల్లో ఇంకా బాగా పని చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ సీటును ఈ సారి వదులుకోలే పరిస్థితి లేదు..సిరిసిల్ల మెజార్టీ తో గెలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపిపిలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకలు జిందం చక్రపాణి, ఆకునూరి శంకరయ్య, గడ్డం నర్సయ్య, బొల్లి రాంమోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.