మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎలుసాని ?

మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎలుసాని ?
  • పోటీలో నలుగురు
  • ఐదు నెలల క్రితం ముద్రలో చెప్పిందే నిజం

 ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఉద్యమకారుడు మాజీ మండల అధ్యక్షుడు ఎలుసాని మోహన్ కుమార్ కే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేట్ పదవి కట్టబెట్టేందుకు దాదాపుగా పూర్తి అయినట్లు విశ్వసనీయ సమాచారం గత 5 నెలల క్రితం ముద్ర లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కేది ఎవరికో అనే శీర్షిక ద్వారా చెప్పిందే నిజం కాబోతుంది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు కీర్తిశేషులు ఎలుసాని మల్లన్న రెండవ కుమారుడు ఎలుసాని మోహన్ కుమార్ 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి చురుకైన పాత్ర పోషించి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఆనాటి ఎమ్మెల్యే కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మండల టిఆర్ఎస్ అధ్యక్షునిగా కొనసాగి అనంతరం ఎంపీటీసీగా పోటీచేసి కేటీఆర్ ఆశీస్సులతో ఎంపీపీగా రెండున్నర సంవత్సరాలు కొనసాగాడు. మరోసారి మహిళ రిజర్వేషన్ లో భాగంగా తన భార్య సుజాతను ఎంపీటీసీగా పోటీ చేయించి గెలిచి మరోసారి తన రాజకీయ చతుర్బలం తోట ఆగయ్య సహకారంతోఎంపీపీ పదవిని దక్కించుకున్నాడు. పదవి కాలం పూర్తిచేసుకుని గత మూడున్నర సంవత్సరాల నుంచి ఏ పదవి లేకుండా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండ రమేష్ గౌడ్ పదవి పూర్తి కావడంతో ఈసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి చేపట్టాలనే గట్టి పట్టుదలతో తనకున్న రాజకీయ అస్త్రాలను ఉపయోగించుకొని పావులు కదిపి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నాడు. బొప్పాపూర్ మార్కెట్ కమిటీ నామినేట్ గా బీసీ రిజర్వేషన్ కావడంతో ఉద్యమకారుడు పులి రమేష్, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, మీసం రాజం తదితర నాయకులు ఎవరికి వారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు.