నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ప్రమాద నివారణ సూచిక బోర్డులు పరిశీలించిన డి.ఎస్పి

నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ప్రమాద నివారణ సూచిక బోర్డులు పరిశీలించిన డి.ఎస్పి

జోగుళాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : జిల్లా ఎస్పీ. కె. సృజన, ఆదేశాల మేరకు డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగస్వామి, జిల్లా లో కృష్ణ నది నుండీ తుంగభద్ర నది వరకు 48 కెలోమిటర్ల మేర ఇటిక్యాల, కొదండపురo, మనోపాడ్, ఉండవల్లి పోలీస్ స్టేషన్ల పరిదిలో ఉన్న 44 వ జాతీయ రహదారి పై ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ను అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ తో, హై వే అథారిటీ ఇంజనీర్ భార్గవ తో కలిసి పరిశీలించారు. అందులో బాగంగా బీచుపల్లి - యక్తాపూర్‌ ఎక్స్‌రోడ్‌, ఎర్రవల్లి ఎక్స్‌ రోడ్డు, కొండేరు క్రాస్‌, ఇటిక్యాల స్టేజీ, కోదండాపూర్‌ క్రాస్‌, వేముల స్టేజీ, మానోపాడు స్టేజీ వద్ద, ఇతర ప్రాంతాల్లో 22 జంక్షన్ లను డీఎస్పీ. గుర్తించి స్వయంగా పరిశీలించారు. అయ జంక్షన్ లాలో జిల్లా ఎస్పీ. సూచించిన ప్రికాషన్స్ ప్రకారం అక్కడ కొన్ని ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయవలసిన ఏర్పాటు చేయవలసిన పవర్ బ్లింకర్లు/సోలార్ బ్లింకర్లు ఏర్పాటు, జంక్షన్ అహెడ్, స్పీడ్ లిమిట్, యు టర్న్, మీడియన్‌లో గ్యాప్, గో, రంబుల్ స్ట్రిప్స్ , ఎడమ రోడ్డు, కుడి రోడ్డు మొదలైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయుట.

మధ్యస్థ మరియు జంక్షన్ ప్రదేశాలలో గ్యాప్ వద్ద బ్లింకర్స్ ఎర్పాటు, రిఫ్లెక్టివ్ పెయింట్‌తో సమీపించే రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్‌ను వేయడం, వాటికి పెంటింగ్, లైటింగ్, అవసరమైన చోట ఐ-మాక్స్ లైట్లు ఏర్పాటు చేయటం, రోడ్డుకు రెండు వైపులా రిఫ్లెక్టర్‌లతో బ్లాక్ స్పాట్స్ సైన్ బోర్డ్‌ను ఏర్పాటు చేయండి గురించి,రేడియం స్టిక్కర్‌లతో కూడిన జిగ్‌జాగ్ వాటర్‌ బారికేడ్‌లు ఏర్పాటు, రిఫ్లెక్టర్లతో రోడ్ మార్కింగ్ ఇవ్వడం, సర్వీసింగ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయటం తదితర ఏర్పాట్ల గురించి డి.ఎస్పీ. హై వే అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని పై వారు సానుకూలంగా స్పందించి పోలీస్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతోందని హై వే అథారిటీ వారు తెలిపారు. రోడ్డు ప్రమాదల నివరణకు ప్రత్యేక చర్యలు జాతీయ రహదారుపై రోడ్డు ప్రమాదల నివారణకు జిల్లా ఎస్పీ. ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి.ఎస్పీగారు అన్నారు. అందులో బాగంగా జాతీయ రహదారు ప్రక్కల ఉన్న 21 గ్రామాలలో పోలీస్ కళా బృందంతో, లోకల్ పోలీస్ వారితో రోడ్డు సేఫ్టీ నియమాలు,  ప్రయాణాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని ఇప్పటికే 13 గ్రామాలలో పుర్తి కాగా మిగిలిన 8 గ్రామాలలో కూడా జాతీయ రహదారి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాటించాల్సిన జాతీయ రహదారి నియమాల గురించి, జాగ్రత్తల గురించి, (ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్  లేకుండుట, సీట్ బెల్ట్,హెల్మెట్ ధరించడం) అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు.

పోలీస్, రోడ్డు అథారిటీ వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు ముఖ్యంగా వాహన దారులలో మార్పు వచ్చి జాతీయ రహదారి మీదకు వెళ్ళేటప్పుడు సైన బోర్డ్ లను గమనిస్తూ, జాతీయ రహదారి నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం అని కావున ప్రజలు పోలీస్ మరియు రోడ్డు అథారిటీ వారి సూచనలు పాటించాలని  డి. ఎస్పీ. కోరారు.