ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎందుకు....?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎందుకు....?

సాగునీరు అందక ఎండిన పంట పొలాలు..

2లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి  భారీనష్టం..

కాల్వకు నీళ్లు ఇడుస్తలేరు ఓ రైతు ఆవేదన..

 నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో గొంగళ్ల రంజిత్ కుమార్.

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గద్వాల :  మండలం అనంతపురం గ్రామంలో వ్యవసాయ పొలానికి సాగనీరు అందక పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర లో భాగంగా  గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. ఈరోజు బీరెల్లి లో ప్రారంభమైన పాదయాత్ర బస్వాపురం నుండి అనంతపురం గ్రామం మీదుగా సాగి, మధ్యాహ్న విరామం తదనంతరం పూడూరు గ్రామానికి చేరుకోవడం జరిగింది.బస్వాపురంలో గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోయారు. గ్రామంలో ప్రభుత్వ స్కూల్ లేక అందరూ ఎర్రవల్లిలోని ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నట్లు చెప్పారు.అనంతపురం గ్రామంలోని మైబెల్లి అనే ఓ రైతు దాదాపు  5 ఎకరాలకు 2 లక్షల 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి  సాగునీరు అందక వరి పంట మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉందని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సంద్భంగాగొంగల్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2లక్షల  ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామన్న పాలకులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలని గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. వారబంది ప్రకారం సాగనీరు అందించాల్సిన వీరు వాళ్ల అవసరం ఉన్నప్పుడు ఒకరోజు సాగునీరు కాలువలు ద్వారా విడిచి మిగతా నాలుగు రోజుల వరకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని దీంతో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఈ విషయాన్ని గమనించి అధికారులు వెంటనే సాగనీరు అందించడానికి కృషి చేయాలని కోరారు.అనంతపురం సభలో మాట్లాడుతూ ఇన్నాళ్లు వీరి పాలనలో అభివృద్ధి పరంగా నియోజకవర్గం వెనుకబాటుతనానికి గురైందని ప్రజలకు సంక్షేమ అందించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు నాయకులు శ్రీనివాస్ యాదవ్, లవన్న, కవి అవని శ్రీ, విష్ణు ప్రేమ్ రాజ్, రంగస్వామి, నాగేష్ యాదవ్, నెట్టెంపాడు గోవిందు, అంజి, దాసరిపల్లి రాముడు, రమేష్, పరుశురాముడు, సవారన్న, లక్ష్మన్న, నేతన్న, భూపతి నాయుడు, భీమన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.