జాతీయ పంచాయతీ అవార్డు -2023

జాతీయ పంచాయతీ అవార్డు -2023

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీల పురస్కారోత్సం హాజరైన ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్, జిల్లా కలెక్టర్  ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో పాత ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ అవార్డు 2023 జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం, జడ్పీ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. హాజరయ్యారు.
ఎమ్మెల్యే కి పుష్పగుచ్చం జిల్లా అధికారులు స్వాగతం పలితాలు.

  జోగులాంబ గద్వాల జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన 27 గ్రామ సర్పంచులకు పంచాయతీ సెక్రెటరీ లకు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కలిసి శాలువా మెమొంటో ప్రశంసా పత్రం ఇచ్చి ఘనంగా సత్కరించారు .

గద్వాల ఎమ్మెల్యే  మాట్లాడుతూ..

గద్వాల నియోజకవర్గంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన సర్పంచులకు  పంచాయతీ కార్యదర్శులకు  హార్థిక శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే సీఎం కేసీఆర్. నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సహకారంతో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్. అనేకమైన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామాలలో డంపింగ్ యార్డ్ లో,  వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలు ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసి కోసం కృషి చేయడం జరిగినది. గ్రామాలలో పంచాయతీ సర్పంచులు చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ సర్పంచ్  పదవి కాలం పూర్తి అయిన వారు చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. ఇదేవిధంగా గ్రామపంచాయతీ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను మరింత ప్రతిష్టంగా అభివృద్ధి చేసి మోడల్ గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి అవార్డులో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో గద్వాల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామపంచాయతీ ఎంపికయ్య విధంగా కృషి చేయాలి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రామపంచాయతీలో పెండింగ్లో ఉన్న నిధులను త్వరగా విడుదల చేయడం జరుగుతుంది.  తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూడడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 

జోగులాంబ గద్వాల జిల్లా లో 251 గ్రామపంచాయతీలో 27 గ్రామ పంచాయతీ ఉత్తమ పురస్కారానికి ఎంపిక వారికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో మూడు విషయాలను పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి గ్రామాలలో పారిశుద్ధం నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అదేవిధంగా గ్రామాలలో  తెలంగాణ ప్రతిష్టాత్మకంగా  పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిపై ప్రస్తుతం ఎండాకాలం రాబోతున్నది.  మొక్కలకు కాపాడుకోవాలి గ్రామాలలో మొక్కలను పెంచాలి మొక్కలు పెరగడం వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక దిష్టి వహించి విద్యారంగంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నెల రోజుల్లో వేసవికాలం సెలవులు రాబోతున్నాయి. ఆ నెల రోజుల్లో మన ఊరి మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలు కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తిచేసి విద్యార్థులు పున ప్రారంభంలో పాఠశాల వచ్చే సమయంలో అన్ని వసతులను కల్పించి మోడల్  పాఠశాలలుగా ఏర్పాటు చేయాలని సర్పంచి కార్యదర్శులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపి విజయ్ రాజారెడ్డి, మనోరమ్మ, జడ్పిటిసిలు రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, పాక్స్  ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపి రామకృష్ణ నాయుడు, పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి శ్యామ్,  వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.