ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో మైనార్టీలకు భద్రత

ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో మైనార్టీలకు భద్రత

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల శాసనసభలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సొంత ఖర్చుతో పేద మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణి.

రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో 1500 మంది పేద మైనార్టీ మహిళలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, సొంత ఖర్చుతో రంజాన్ తోఫా  పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి. చేతుల మీదుగా నిరుపేద మైనార్టీ సోదరులు సోదరీమణులకు తోఫా ను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు నిర్వహించింది. మైనార్టీల కూడా విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని సీఎం కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్య ఇస్తూ అన్ని కుల మతాలను గౌరవిస్తూ  అన్ని పండగలకు  ప్రజలకు కానుకను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెలిపారు. ప్రతి ఒక్కరు సోదరులు 30 రోజులు కఠిన దీక్ష పూర్తి చేసి పవిత్రమైన రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలను నిర్వహించి. రంజాన్ పండగ వేడుకలను వారి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జరుపుకోవాలని. అల్లా ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు గద్వాల నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో  నిండు నూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా అల్లాను కోరుకోవడం జరుగుతుంది తెలిపారు.

ప్రజలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపి ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా కెటిర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ రెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్, ఖలీల్, నీలేశ్వర్ రెడ్డి, బీచుపల్లి, సీసాల పాషా, భగీరథ వంశీ, కురుమన్న, రెహమాన్, ఫయాజ్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.