ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలదే

ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలదే
Gadwal MLA Bandla Krishnamohan Reddy
  • కడ దాకా కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటా
  • సంక్షేమ పథకాలపై ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలె
  • గతి తప్పితే మరలా గోసపడతాం
  • గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • మిట్టదొడ్డిలో గట్టు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని మిట్టదొడ్డి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హాజరయ్యారు. మిట్టదొడ్డి గ్రామంలో ముందుగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.   దేవాలయంలో  శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ శివుని ఆశీస్సులు పొందడం జరిగినది.ఎమ్మెల్యే మాట్లాడుతూ. గతంలో వివిధ పార్టీలు పరిపాలించడం జరిగినది. 8 ఏళ్లు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించడం జరిగింది గతానికి ఇప్పటికీ ఎన్నో తేడాలు ఉన్నాయి గతంలో గట్టు మండలం ఆసియా ఖండంలోని  అక్షరాస్యత లో వెనుకబడి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి లేక ఇక్కడ నివసించే ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర తమిళనాడు, వంటి ప్రాంతాలకు వలసలుగా వెళ్లి జీవనాన్ని కొనసాగించేవారు. ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక విద్యుత్ లేక విద్యా లేక ఎన్నో ఇబ్బందులను ప్రజలు ఎదుర్కోవడం జరిగింది.

తెలంగాణ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో పాలమూరు కష్టాలను తెలుసుకొని గట్టు మండలం లోని కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రజల బాధలను గ్రహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేసిన నాయకుడు సీఎం కేసీఆర్ ని గర్వంగా పేర్కొన్నారు. నేడు గట్టు మండలం అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రావడం జరుగుతుంది.  వ్యవసాయ రంగానికి రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్ కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు, వంటి నగదు రూపంలో తో పాటు సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు స్మశాన వాటికలు మన ఊరు మనబడి గట్టు మండలంలో 17 పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరించడం వివిధ అభివృద్ధి పనులకు ద్వారా గట్టు మండలంలో సుమారు 380 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. అన్ని విధాలుగా రైతులకు అండగా నిలిచి గతంలో వ్యవసాయం అంటే దండగ కానీ కేసీఆర్.  వ్యవసాయం అంటే పండగ నిరూపించింది. అదే కాక ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి మన ప్రాంతానికి కూలి పని చేయడానికి రావడం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రాంతంలో అధికారంలో ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు కర్ణాటక ప్రాంతంలో అమలు కావడం లేదు ఈ విషయాన్ని గ్రహించాలి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్. అనేకమైన సంక్షేమ పథకాలను పుట్టిన బిడ్డ నుంచి చావుకు కాలు చాపే వృద్ధుల వరకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారుడు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం సీఎం కేసీఆర్. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితుల ఆత్మ గౌరవంగా బతకాలని అన్ని వర్గాలతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అని తెలిపారు. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్ర అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావాలని సీఎం కేసీఆర్. నాయకత్వంలో సీఎం కేసీఆర్. పరిపాలన మా ప్రాంతాల్లో కూడా కావాలని బిఆర్ఎస్ పార్టీ వైపు మగ్గు చూపుతున్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేత పెట్టి వారికి పెత్తందారులు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ కావడం జరుగుతుంది. రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైతులకు సవతి ప్రేమ చూపించడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించాలి. ఈ మధ్యకాలంలో వివిధ రకాల వేషాలతో గ్రామాలలో వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి మీరు వారు చెప్పిన మాటలు వింటే అభివృద్ధిలో మన గ్రామాలు రాష్ట్రం మరో 20 సంవత్సరాలు వెనక్కి పోతుంది కాబట్టి తప్పుడు మాటలు వినకుండా వారి పలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. గ్రామాలే దేశానికి పట్టికొమ్మలు గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ ని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి నాకు కూడా మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప,  జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపి  విజయ్, జెడ్పిటిసీ   బాసు శ్యామల, పాక్స్ ఛైర్మన్  వెంకటేష్,  మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, సర్పంచ్ షేడ్రిక్, జడ్పీ కో ఆప్షన్ నెంబర్, మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్, మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్,  వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామాంజనేయులు, గద్వాల తిమ్మప్ప,  రాము, శివరాం రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కురుమన్న  ఆలీ, రామకృష్ణ నాయుడు, సురేష్,  శ్రీనివాస్ రెడ్డి, ముని చంద్ర గౌడ్, నాగరాజు, గోవిందు, బాబు, వినోద్ శెట్టి, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.