సీపీయస్ యూనియన్ డైరీ అందజేత

సీపీయస్ యూనియన్ డైరీ అందజేత

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్. జోగులాంబ గద్వాల్ జిల్లా శాఖ అధ్వర్యంలో ఈ రోజు గద్వాల్ జిల్లా ఏరియా అస్పటల్సూ పరింటెండెంట్ డా". కిషోర్ కుమార్ కి. ఆర్.ఎం.ఓ డా". వృషాలి కి. జిల్లా, రాష్ట్ర క్యాలెండర్లను సీపీయస్ డైరీ లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఈ డైరీలో సీపీయస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పూర్తి జీఓలు, వివిధ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానము అమలు జీవోలు. సమస్త సమాచారం పొందుపరచటం జరిగిందని అన్నారు.

సీపీయస్ రద్దుకు రాబోయే 6నెలల్లో సీపీయస్ యూనియన్  ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, జిల్లా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర సహా అధ్యక్షుడు విష్ణు, జిల్లా కోశాధికారి వన్నవాడ రమేష్ కుమార్, డాక్టర్ వరలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు పాల్వాయి లక్ష్మి నారాయణ, జిల్లా కార్యదర్శి మస్తాన్ వలీ, జిల్లా సభ్యులు జయన్న, సతీష్, తదితరులు పాల్గొన్నారు.