నేటి సమాజంలో బాలికలకు ఆత్మరక్షణ  విద్యా  ఎంతో అవసరం: బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి

నేటి సమాజంలో బాలికలకు ఆత్మరక్షణ  విద్యా  ఎంతో అవసరం: బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి

బాలికలకు కుంగ్ ఫులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం

ప్రభుత్వం బాలికల ఆత్మరక్షణ విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది

ప్రస్తుతం యువత  వ్యాయామానికి సమయం కేటాయించాలి

ఆరోగ్య తెలంగాణ దిశగా మనమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :నేటి సమాజంలో బాలికలపై జరిగే దాడుల నుంచి తమకు తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ  నేర్చుకోవాలని  ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలి ఎమ్మెల్యే సతీమణి, బూరెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి క్రిష్ణ మోహన్ రెడ్డి, తెలిపారు. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని చింతలపేట లోని, ఇండోర్ స్టేడియంలో కుంగ్ ఫూ  శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఎమ్మెల్యే సతీమణి, బూరెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఎమ్మెల్యే సతీమణి, సర్పంచ్ బండ్ల జ్యోతి మాట్లాడుతూ:

స్వీయ రక్షణ, ఆత్మ రక్షణ కోసం కుంగ్ ఫూ ను  నేర్చుకోవాలి అని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సైతం బాలికల రక్షణ కోసంవ్యాయామాలు,విద్యాలయాలు కుంఫు కరాటే చేర్చాలి పాఠశాలలో ప్రతిరోజు ఒక పీరియడ్ ను ఆత్మ రక్షణ విద్యలను  అందించాలని కోరారు. బాలికలు స్వేచ్ఛగా రోడ్డుపైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలి మనిషికి ఆరోగ్యం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని దేశం కూడా బాగుపడుతుందని తెలిపారు. గ్రౌండ్లో ఎప్పుడు అయితే జనం పెరుగుతుందో ఆరోజు ఆరోగ్య తెలంగాణ తయారవుతుందని అన్నారు. గద్వాలలో గత పాలకులు నిర్లక్ష్యం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  ఒక గ్రౌండ్ కూడా ఉండేది కాదని  అన్నారు.

నేడు ‌ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులు అందుబాటులో  ఎమ్మెల్యే తన సొంత నిధులతో గ్రౌండ్స్ ను అభివృద్ధిపరిచి క్రీడాకారులకు అందుబాటులో తెచ్చారు. అలాగే ప్రతి గ్రామ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేశారు క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, ఉమ్మడి జిల్లా కెటిర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ రెడ్డి, సర్పంచ్ మహబూబ్, ఇండోర్ స్టేడియం ఇంచార్జ్ జితేందర్, బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు  సంగీత,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ రెడ్డి, జగదీష్, కృష్ణ వీరేష్ చిన్న, గాంధీ, కుంగ్ ఫూలో కరాటే మాస్టర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.