వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్(ఫంక్షన్ హాల్) నిర్మాణానికి 44 లక్షల రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యే కి  కృతజ్ఞతలు తెలిపిన వడ్డెర సంఘం నాయకులు

వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్(ఫంక్షన్ హాల్) నిర్మాణానికి 44 లక్షల రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యే కి  కృతజ్ఞతలు తెలిపిన వడ్డెర సంఘం నాయకులు
Vaddera Sangam Community Hall

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా  కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వడ్డెర సంఘం  కమ్యూనిటీ హాల్ (ఫంక్షన్ హాల్) నిర్మాణానికి కోసం 44లక్షలు రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే కి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, వడ్డెర సంఘం అధ్యక్షులు కొండాపురం గోపాల్, టీచర్ నాగరాజు, రిపోర్టర్ వెంకటేశ్వర్లు, ఐడియా పరుశ వడ్డెర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.