డబుల్‌’ ఇళ్ల కోసం భగ్గుమన్న పేదలు

డబుల్‌’ ఇళ్ల కోసం భగ్గుమన్న పేదలు
  • అర్హుల జాబితాలో అన్యాయం జరిగిందని ఆవేదన 
  • పలు చోట్ల వార్డు సభలు బహిష్కరణ
  • గోడలపై అంటించిన అర్హుల జాబితా లిస్టు చించివేత
  • సోమనాద్రి నగర్ కాలనీ వాసుల ఆశలు అడియాసలేనా..
  • డబుల్ బెడ్రూం ఇస్తానని హామి ఇచ్చిన అధికారులు నేడు అనర్హులుగా ఎందుకు ప్రకటించారు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల : డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకోసం దరకాస్తు చేసుకున్న లబ్దిదారుల అర్హుల జాబితా పరిశీలనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ. గద్వాల మున్సిపాలిటిలో పలు వార్డులలో  పేదలు నిరసన వ్యక్తం చేశారు. అర్హులను కూడా అనర్హుల జాబితాలే చేర్చడం పై పేదలు ఆవేధనకు గురయ్యారు. శనివారం నిర్వహించిన పలు వార్డులో సభలను పేదలు బహిష్కరించారు. గద్వాల్ మునిసిపాలిటీ పరిధిలో నిర్మించిన 560 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరకాస్తు చేసుకున్న అభ్యర్థుల లబ్దిదారుల ఎంపికలో అభ్యంతరాలు స్వీకరించుటకు అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులను కూడా అనర్హుల లిస్టులో చేర్చడం,‌ ప్రభుత్వ అధికారులు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే రిజెక్టు చేశారని అరోపించారు. ఇళ్లు దక్కదేమోనని‌. ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నేతల ఆదేశాలకు తలొగ్గి నిజమైన పేదల పేర్లు కాకుండా సంపన్నుల పేర్లే జాబితాలో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సోమనాద్రి నగర్ లో మిన్నంటిన నిరసన సెగ
గద్వాల మున్సిపాలిటి 37వ వార్డులో‌ గల సోమనాద్రి నగర్ లో వర్షాకాలం కోట గోడలు కూలి మట్టి ఇండ్లపై పడి పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే బికు బిక్కు మంటు నివసిస్తున్న కాలనీవాసులకు అధికారులు శాశ్వతమార్గం చూపెడుతామని అనేక హామీలు ఇచ్చారు.‌ కాలనీలో నివసిస్తున్న 45కుటుంబాలకు డబుల్ అర్హుల లిస్టు లో 4 దక్కడంపై నిరాసకలిగించింది. సోమనాద్రి నగర్ లో అన్ని కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామన్నా అధికారులు నేడు అర్హుల జాబితాలో అనర్హులుగా ఉండటంపై అవేధన కలిగించింది.

ఏళ్లుగా కోట కాలనీలో నివసిస్తున్నా కాలనీవాసులకు వానకాలంలో కోట కూలి పోతుందని ఇండ్లు ఖాళీ చేయమంటున్నారు. కాని ఇప్పటి వరకు ఇండ్లు ఇయ్యలేదని. వాన కాలంలో కోట గోడల మట్టి కూలినప్పుడల్లా అధికారులు, పాలకులు సందర్శించి వెళ్లడమే కాని. శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ లో కోటకాలనీలో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీఇచ్చిన అధికారులు నేడు  అనర్హులుగా ప్రకటించారని ప్రభుత్వం మరో సారి పరిశీలించి సోమనాద్రి నగర్ కాలనీవాసులకు డబుల్ బెడ్రూంలు కేటాయించాలని డిమాండ్ చేశారు.