సేవ్‌ రాహుల్‌ గాంధీ, సేవ్‌ డెమోక్రసీ.. ఓయూలో నిరసన ర్యాలీ  

సేవ్‌ రాహుల్‌ గాంధీ, సేవ్‌ డెమోక్రసీ.. ఓయూలో నిరసన ర్యాలీ   

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ ఓయూలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ చేపట్టింది. 'సేవ్‌ రాహుల్‌ గాంధీ, సేవ్‌ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు గాంధీభవన్‌లో జీహెచ్‌ఎంసీ నాయకులతో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ.. నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి, నిరసన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగర నాయకులంతా నిరసనల్లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.