రాజ్యాధికారంతోనే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది  గొంగళ్ల రంజిత్ కుమార్

రాజ్యాధికారంతోనే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది  గొంగళ్ల రంజిత్ కుమార్

6వ రోజు నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో పలు గ్రామప్రజలు సంఘీభావం.

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి: ధరూర్  మండలంలోని గొంగళ్ల రంజిత్ కుమార్. ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర బుధవారం ఉదయం ఉప్పేరు నుండి గుడ్డెందొడ్డి, వామన్ పల్లి, నర్సన్ దొడ్డి. గ్రామం వరకు కొనసాగింది. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత సాయంత్రం చిన్న చింతరేవుల, రేవులపల్లి, పెద్ద చింతరేవుల వరకు చేరింది. అలాగే నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా గుడ్డెందొడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు, మహిళామణులు పెద్ద ఎత్తున ఎడ్లబండిపై ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. వామన్ పల్లి గ్రామంలో మహిళలు ప్రత్యేకంగా హారతులు పట్టి రంజిత్ కుమార్. కి వీర తిలకం దిద్ది  ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో మల్దకల్ మండలంలోని సద్దనోనిపల్లి, అమరవాయి అలాగే ధరూర్ మండలంలోని ఓబులోనిపల్లి గ్రామ ప్రజలు పాల్గొని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర కు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలను చైతన్యం చేయడానికి నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర  గ్రామ గ్రామాన ప్రజలను ఐక్యమత్యం చేయడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో గద్వాల కోటపైన బహుజన జండా ఎగరవేయడానికి బహుజనులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కొరకు నడిగడ్డ ప్రాంతంలో మార్పు ఒక చరిత్రలో నిలవాలని కోరారు. నడిగడ్డ ప్రాంతంలో సరైన విద్య, వైద్యం, సంక్షేమం అభివృద్ధి లేక వెనకబాటుకు గురైన ప్రాంతమని ఈ నడిగడ్డ ప్రాంతంలో విద్య, వైద్యం సంక్షేమ అభివృద్ధికై మా పోరాటం నిర్వహిస్తామని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మాట్లాడారు.

నడిగడ్డ ప్రాంతంలో రాబోయే రోజుల్లో గద్వాల కోటపై బహుజన జండా ఎగరాలంటే మహనీయుడు అందరివాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఇచ్చిన ఓటు అనే బలమైన ఆయుధంతో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ఈ సందర్భంగా అయా గ్రామాల్లో ప్రజలు వారి సమస్య లను గోంగళ్ళ రంజిత్ కుమార్,దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, నాగేష్, అవనిశ్రీ, వామన్ పల్లి, రంగస్వామి, పరుషరాముడు, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షుడు మునెప్ప, ఆంజనేయులు, కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి, భీమన్ గౌడ్, ఏసు, ఉపేంద్ర, ఎల్లేష్, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.