రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు నియామకం

రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు నియామకం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు మాల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, భోగం తిరుపతిని జనగామ జిల్లా అధ్యక్షునిగా నియమించారు. హైదరాబాదు బల్కంపేటలో జరిగిన మాల పరిరక్షణ వేదిక సమావేశంలో  జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజుని మాల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మల్కాపూర్ గ్రామానికి చెందిన భోగం తిరుపతిని జనగామ జిల్లా అధ్యక్షునిగా మాల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పిడుగు విజయకుమార్, రాష్ట్ర అధ్యక్షులు వల్లమల్ల శ్రీనివాస్ ప్రకటించారు. కార్యక్రమంలో మాల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మల మైసయ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కడారి శ్రీధర్, మాల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాయిల్లపురం ప్రమీల, మాల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రాయిలపురం నాగమణి పాల్గొన్నారు.