నీ ఆస్తులు రాసిస్తే..

నీ ఆస్తులు రాసిస్తే..
  • నా ఆస్తులు రాసిస్తా 
  • బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: నియోజకవర్గ దళితులపై ప్రేమ ఉంటే నీ ఆస్తులు అన్ని రాసివు.. నా ఆస్తులు కూడా రాసిస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి సవాల్ విసిరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు శివారు శివారెడ్డి పల్లిలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆదివారం కడియం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పని తీరు, 9 ఏళ్ల అభివృద్ధి పై టిఆర్ఎస్ కు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రజా ఆశీర్వాద సభకు లక్ష మంది హాజరవుతారని తెలిపారు. నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు రుణం తీర్చుకునేందుకు మరొక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, చతిస్గడ్లలో అమలు చేయని ఆరు గ్యారెంటీలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని శ్రీహరి ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల ప్రచారం చేస్తున్న మోసపూరిత మాటలను ప్రజలందరు గమనించాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో ఇస్తున్నటువంటి పింఛన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

అయిదు గంటల కరెంటు ఇచ్చి కాంగ్రేస్ పార్టీ కావాలా ఇరవై నాలుగు గంటల నాన్యమైన కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర పై అనుచిత వాఖ్యలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అటువంటి వాఖ్యలను కడియం తీవ్రంగా ఖండించారు. ఇందిరకు ఓటమి భయం పట్టుకొని విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు.నియోజకవర్గ మాదిగ బిడ్డలపై ప్రేమ ఉంటే ఇందిర ఆస్తులన్నీ రాసిస్తే నేను కూడా నాయెక్క ఆస్తులను రాసిస్తానని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే టిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నేతలు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, పోగుల సారంగపాణి, మండల శ్రీరాములు, ఆకుల కుమార్, రాపోలు మధుసూదన్ రెడ్డి, రేఖ, సింగపురం జగన్, మాచర్ల గణేష్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

“ఎల్ హెచ్ పి ఎస్ మద్దతు”

గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు నాయక్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం కాకుండా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని గడప గడపకు తిరిగి కడియం శ్రీహరి గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట పూల్ సింగ్, శ్రీధర్, రమేష్, బాలాజీ, క్రాంతి, శంకర్, హరిలాల్, సూర్య, భీమ్లా నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు.