పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి

పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి

 పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజు

రఘునాథపల్లి, ముద్ర: పద్మశాలి కులస్తులు ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరూ సంఘంలో సభ్యత నమోదు చేసుకోవాలని ఆ సంఘం జనగామ జిల్లా అధ్యక్ష,  కార్యదర్శులు వేముల బాలరాజు నేత, దోర్నాల వెంకటేశ్వర్లు నేత పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు కర్మికొండ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పద్మశాలీలు రానున్న రోజుల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరారు. త్వరలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఉన్నాయని వారు తెలిపారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని సంఘం నాయకులకు సూచించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా మీడియా ఇన్​చార్జి చింతకింది కృష్ణమూర్తి నేత, జనగామ జిల్లా సలహాదారులు బోగ రామ్ దయాకర్, కౌన్సిలర్ గుర్రం నాగరాజు, తలకుక్కల భిక్షపతి నేత, బాలరాజు, గుండ కృష్ణమూర్తి, కార్మికొండ నాగేశ్, కృష్ణ, ప్రదీప్, చింతకింది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.