లారీ డీ డ్రైవర్ మృతి

లారీ డీ డ్రైవర్ మృతి

 జనగామ ప్రతినిధి, ముద్ర: జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో లారీ డ్రైవర్ వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి మరో ఇసుక లారీ ఢీకొంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జుట్టు వెంకటయ్య (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.