మద్యం, బతుకమ్మ చీరలు సీజ్ ... కేసు నమోదు

మద్యం, బతుకమ్మ చీరలు సీజ్ ... కేసు నమోదు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఎన్నికలు నిబంధనల అమలులో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న ఐలోని కిరణ్ కుమార్ ఇంటి వద్ద టాస్క్ ఫోర్స్ సిబ్బంది రూ.15,620 ల విలువ చేసే 22 మద్యం బాటిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఎన్నికల నియమాలికి విరుద్ధంగా తాటికొండలో బతుకమ్మ చీరలు పంచుతుండగా ఎంసిసి ఇంచార్జ్ శ్రీధర్, టాస్క్ఫోర్స్ సిబ్బంది రేషన్ డీలర్ బాబురావు వద్ద 50 చీరలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.