గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి

కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య
ముద్ర ప్రతినిధి, జనగామ:  గిరిజన సంస్కృతి,  సంప్రదాయాలు గొప్పవని జనగామ కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పాలకుర్తి మండలం పెద్దతండాలో నిర్వహించిన గిరిజన దినోత్సవంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసిందన్నారు. 

అందులో భాగంగానే 500 జనాభా పైబడిన గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిందని చెప్పారు. గిరిజన ప్రతినిధులు పారదర్శకంగా గ్రామాల అభివృద్ధికి స్వయంగా ప్రతిపాదనలు సమర్పించి పనులు నిర్వహించుకోవడం శుభపరిణామం అని తెలిపారు. గిరిజనులు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పులాజి బాబా, దుర్గామాత, సంత్ సేవాలాల్  ప్రబోధనల ద్వారా సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో  ఉంటారన్నారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, డిపిఓ రంగాచారి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, పాలకుర్తి సర్పంచ్ యాకంతారావు, ఎంపీడీవో అశోక్ కుమార్, తహసిల్దార్ పాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.