మెదక్ లో డా.ప్రీతికి  కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళీ

ముద్ర ప్రతినిధి, మెదక్: నిమ్స్ లో ఐదు రోజులపాటు నరకాయాతన అనుభవించి మృతి చెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ ఆత్మకు నివాళిగా జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

రాష్ట్రంలో ర్యాగింగ్ బూతం చెలరేగుతుందన్నారు. డాక్టర్ పి పి నాయక్ మరణానికి కారకులైన వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగయ్య, వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గౌడ్, ఉద్యోగులు ఈశ్వర్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.